పీసీసీ పీఠం ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం: శ్రీధర్‌బాబు

ABN , First Publish Date - 2020-12-17T21:32:30+05:30 IST

పీసీసీ అధ్యక్ష పదవి హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

పీసీసీ పీఠం ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం: శ్రీధర్‌బాబు

సిద్దిపేట: పీసీసీ అధ్యక్ష పదవి హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని తాడుర్ బలాగౌడ్ పంక్షన్ హాల్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికే కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మూడో తరానికి అందించే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లా హరీశ్‌రావు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు 10 వేల దరఖాస్తులు వస్తే ఏడేళ్లలో రెండు వేలు మాత్రం ఇచ్చారన్నారు. మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లు కట్టిస్తామని చెప్పిన కేటీఆర్.. ఎన్ని కట్టించారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై కూడా విధాన పరమైన నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు.

Updated Date - 2020-12-17T21:32:30+05:30 IST