కరోనా నివారణలో మనముంటే...ఏపీ సీఎం మాత్రం: చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2020-05-13T18:26:59+05:30 IST

కరోనా నివారణలో మనముంటే...ఏపీ సీఎం మాత్రం: చిన్నారెడ్డి

కరోనా నివారణలో మనముంటే...ఏపీ సీఎం మాత్రం: చిన్నారెడ్డి

హైదరాబాద్: ‘‘కరోనా నివారణలో మనమంతా ఉంటే...పక్క రాష్ట్రం సీఎం జగన్ మాత్రం మన నీళ్ళు దోచుకునే పనిలో పడ్డారు’’ అని మాజీ మంత్రి చిన్నారెడ్డి విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ  అందరికంటే ముందు స్పందించాల్సిన సీఎం కేసీఆర్... ప్రతిపక్ష పార్టీలు స్పందించిన తరువాత స్పందించారని మండిపడ్డారు. దీనిని బట్టి కేసీఆర్ జగన్‌లు అవగాహనతో ఉన్నారని స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ చర్యలతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. 


అప్పట్లో ఎన్టీఆర్‌కు సినిమా జీవితం ఇచ్చిన తమిళనాడు రుణం తీసుకునేందుకు తెలుగు గంగ చేపట్టారని గుర్తు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ పేరుతో తవ్విన కాలువలు చూసి రాయలసీమ నాయకులకు అశ పుట్టిందని...దాంట్లో భాగంగానే పోతిరెడ్డి పాడు తెచ్చారన్నారు. దీనిని వైఎస్ఆర్ 44 వేల కుసెక్కులకు పెంచారని చిన్నారెడ్డి తెలిపారు. తాజాగా జగన్ దీనిని రెట్టింపు చేస్తు నిర్ణయం తీసుకున్నారన్నారు. పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు అంటే.. కేసీఆర్ మద్దతు లేకుండా సాధ్యం కాదు కదా అని వ్యాఖ్యానించారు. 


కేసీఆర్ తలుచుకుంటే జగన్‌ను పిలిచి చెప్పవచ్చన్నారు. ఏపీ సీఎం చర్యను అడ్డుకొకపోతే దక్షిణ తెలంగాణా దగా అవుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ ఒక్క ఉత్తర తెలంగాణకు మాత్రమే సీఎం కాదని...మూడు వేల ఎకరాలు సాధించలేక మహారాష్ట్ర సీఎంతో చర్చించి ఏడు మీటర్ల తక్కువ ఎత్తులో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. నాడు ఏడు మండలాలు ఏపీలో కలిస్తే కేసీఆర్ స్పందించలేదని... ఇప్పుడు కేసీఆర్ జీఓ 203ను రద్దు చేయించకపోతే చరిత్ర హీనులు అవుతారని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. 

Read more