కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ అహంకారమే

ABN , First Publish Date - 2020-12-17T09:01:21+05:30 IST

త్వరలో బీజేపీలో చేరనున్నట్లు మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ ప్రకటించారు. అభిమానులు, సన్నిహితులు

కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ అహంకారమే

ఉత్తమ్‌ ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్‌ను జీరో చేశారు

త్వరలో బీజేపీలో చేరుతా : మాజీ మంత్రి  చంద్రశేఖర్‌


వికారాబాద్‌, డిసెంబరు 16 : త్వరలో బీజేపీలో చేరనున్నట్లు మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ ప్రకటించారు. అభిమానులు, సన్నిహితులు కూడా తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలనే లక్ష్యంతోనే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను తప్పు పట్టడం లేదని, ఎవరికి సత్తా ఉంటే వారే రాజకీయాల్లో రాణిస్తారని, అయితే కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ అహంకారం పెరగడాన్ని మాత్రం తప్పుపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం నాశనం చేశారని చంద్రశేఖర్‌ ఆరోపించారు. రెండు, మూడు రోజుల్లో తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.  

Updated Date - 2020-12-17T09:01:21+05:30 IST