ముంచిన నాసిరకం మిరపనారు

ABN , First Publish Date - 2020-03-12T10:24:06+05:30 IST

నాసిరకం మిరపనారుతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని కోరుతూ ఖమ్మంజిల్లా మధిర మండలం ఖమ్మంపాడు, తొండలగోపారానికి చెందిన

ముంచిన నాసిరకం మిరపనారు

మధిర రూరల్‌, మార్చి 11: నాసిరకం మిరపనారుతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని కోరుతూ ఖమ్మంజిల్లా మధిర మండలం ఖమ్మంపాడు, తొండలగోపారానికి చెందిన ఐదుగురు రైతులు తమ కుటుంబాలతో కలిసి బుధవారం మధిర రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమ పొలాల్లోని కాపుకాయని మిరపచెట్లను ప్రదర్శించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన ఐదుగురు రైతులు ఇదే మండలంలోని దెందుకూరు సమీపంలోగల ఓ నర్సరీలో మిరప నారును కొనుగోలు చేసి నాటారు. మొక్కలు బాగానే ఎదిగినా.. పూత, కాపు దశకు వచ్చే సరికి విషయం బయటపడింది. 30శాతం మాత్రమే కాపురావడంతో వారు లబోదిబోమంటున్నారు. తాము ఎకరాకు రూ.70వేలకుపైగా పెట్టుబడి పెట్టి నష్టపోయామని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-12T10:24:06+05:30 IST