వెలుగులోకి వస్తున్న మాజీ సీఐ రాకేష్ గౌడ్ లీలలు
ABN , First Publish Date - 2020-11-13T22:56:28+05:30 IST
బోధన్ మాజీ సీఐ రాకేష్ గౌడ్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రాకేష్ పట్టుబడ్డారు.
నిజామాబాద్: బోధన్ మాజీ సీఐ రాకేష్ గౌడ్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రాకేష్ పట్టుబడ్డారు. సాజిద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని భూ వివాదం కేసులో ఇరికించి రాకేష్ బ్లాక్ మెయిల్ చేశారు. సాజిద్‌తో ఎయిర్ గన్, షార్ట్ వెపన్, పంచ్ కావాలని రాకేష్ చాటింగ్ చేశారు. వీటికోసం నాందేడ్‌లో బేరసారాలు చేసిన ఆడియో లీక్ అయింది. ఈ ఆయుధాలు రాష్ట్ర సరిహద్దు దాటించడం కష్టమని ఆడియోలో సాజిద్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల రాకేష్ ఏసీబీకి చిక్కాడు. రూ. 50 వేలు, ఖరీదైన సెల్‌ఫోన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాజిద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రాకేష్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ప్రస్తుతం రాకేష్ రిమాండ్‌లో ఉన్నారు.