బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదు: అటవీ అధికారులు

ABN , First Publish Date - 2020-11-22T00:28:12+05:30 IST

కొమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, పశువుల కాపరులకు కనిపించిందని ఒక వీడియో నిన్నటి నుంచి వైరల్ అయింది.

బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదు: అటవీ అధికారులు

హైదరాబాద్: కొమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ ప్రాంతంలో  పులి సంచరిస్తోందని, పశువుల కాపరులకు కనిపించిందని ఒక వీడియో నిన్నటి నుంచి వైరల్ అయింది. కానీ దీనిపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు అది మహారాష్ట్రకు చెందిన పాత వీడియోగా నిర్థారించారు. యావత్ మల్ జిల్లా అంజన్ వాడి అటవీ ప్రాంతంలో గత నెలలో (అక్టోబర్) కనిపించిన పులి వీడియోను కొందరు యువకులు బెజ్జూరు ప్రాంతంలో పులి అంటూ వాట్సప్ ద్వారా సర్క్యులేట్ చేశారని అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) వినోద్ కుమార్ వెల్లడించారు.


తప్పుడు సమాచారంతో చేస్తున్న ప్రచారం వల్ల స్థానిక గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని, సరిహద్దు అటవీ ప్రాంతంలో పులుల సంచారంపై శాఖాపరంగా అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఒక్క అసిఫాబాద్ జిల్లాలోనే 32 ప్రత్యేక బృందాలు, కెమెరా ట్రాప్ లు, వాచర్ల ద్వారా  పులులు కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు.తప్పుడు సమాచారంతో  ప్రచారమైన వీడియోలను నమ్మవద్దని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-22T00:28:12+05:30 IST