ములుగులో ఫారెస్ట్ ఆఫీసర్స్ వర్సెస్ గిరిజనులు

ABN , First Publish Date - 2020-07-19T00:44:48+05:30 IST

ములుగు : జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో అటవి అధికారులు..

ములుగులో ఫారెస్ట్ ఆఫీసర్స్ వర్సెస్ గిరిజనులు

ములుగు : జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో అటవి అధికారులు.. గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. చింతలమోరి గొత్తికోయ గూడెంలోని పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటుతున్న అటవిశాఖ అధికారులను గిరిజన వాసులు అడ్డుకున్నారు. మా భూముల్లో ప్లాంటేషన్ మొక్కలు నాటితే ఆత్మహత్యకు పాల్పడుతామని పలువురు గిరిజనులు పరుగుల మందు డబ్బాలతో అధికారుల ముందు నిల్చున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు- గిరిజనుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-19T00:44:48+05:30 IST