పెళ్లి చేసుకోవాలని బలవంతం.. ప్రియుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-08T11:02:28+05:30 IST

ఆ ప్రేమ జంట కథ విషాదాంతమైంది. పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలు వెంటబడటంతో.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు కూడా బలవన్మరణానికి

పెళ్లి చేసుకోవాలని బలవంతం.. ప్రియుడి ఆత్మహత్య

పురుగుల మందు తాగిన ప్రియురాలు

 పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

ఖమ్మం రూరల్‌, మార్చి 7: ఆ ప్రేమ జంట కథ విషాదాంతమైంది. పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలు వెంటబడటంతో.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు కూడా బలవన్మరణానికి ప్రయత్నించి.. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం గుర్రాలపాడులో శనివారం జరిగింది.  గుర్రాలపాడుకు చెందిన 21ఏళ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుడిని కోరగా.. అతడు నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో.. ఈ నెల 5న ఆమె ఖమ్మం రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విషయం అందరికీ తెలిసిపోయిందని మనస్తాపానికి గురై శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆ యువతి కూడా.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-03-08T11:02:28+05:30 IST