జవాను కాలేనేమోనని బలవన్మరణం
ABN , First Publish Date - 2020-12-05T08:38:35+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశ్(23

వేములవాడ రూరల్, డిసెంబరు 4: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశ్(23)కు జవాను కావాలనేది లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమించి, ఆరునెలల క్రితం ఆర్మీ సెలక్షన్లలో అర్హత సాధించాడు. ఉత్తరాఖండ్‌లో శిక్షణకు వెళ్లాడు.
శిక్షణలో అతడి కాలికి తీవ్రగాయమైంది. దీంతో అధికారులు వెంకటేశ్‌ను ఇంటికి పంపారు. స్వగ్రామానికి వచ్చి కాలికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. తాను తిరిగి సైన్యంలో చేరలేనేమోనన్న బెంగతో వెంకటేశ్ శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.