ప్లాట్‌ ఫాంపై ప్రసవం !

ABN , First Publish Date - 2020-03-19T10:42:34+05:30 IST

ప్రసవం కోసం వెళ్తున్న ఓ నిండు చూలాలుకు ప్లాట్‌ఫాం వేదికగా కాన్పు చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల రైల్వే స్టేషన్‌లో బుధవారం జరిగింది. మహబూబాబాద్‌కు చెందిన రాతోలు

ప్లాట్‌ ఫాంపై ప్రసవం !

గార్ల, మార్చి 18: ప్రసవం కోసం వెళ్తున్న ఓ నిండు చూలాలుకు ప్లాట్‌ఫాం వేదికగా కాన్పు చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల రైల్వే స్టేషన్‌లో బుధవారం జరిగింది.  మహబూబాబాద్‌కు చెందిన  రాతోలు శైలజ తన పుట్టినిల్లు ఏపీలోని విజయవాడ-కొండపల్లి నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో మహబూబాబాద్‌కు వస్తోంది. రైలు డోర్నకల్‌కు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. అదే బోగీలో ఉన్న గార్ల ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్‌ జ్యోతి  స్థానిక వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. శైలజను గార్ల స్టేషన్‌లో దింపి అక్కడే బెంచిపై చీరలతో తెరచాటు కట్టి.. వైద్యుడు పవన్‌తో కలిసి జ్యోతి ఆమెకు కాన్పు చేశారు. శైలజ మగబిడ్డకు జన్మనిచ్చింది.  

Updated Date - 2020-03-19T10:42:34+05:30 IST