రేపటి నుంచి ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2020-09-13T14:31:52+05:30 IST

ముసారాంబాగ్‌ డివిజన్‌లోని ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ కాలనీలో నూతన ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు సోమవారం నుంచి...

రేపటి నుంచి ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు

హైదరాబాద్, చాదర్‌ఘాట్‌,(ఆంధ్రజ్యోతి): ముసారాంబాగ్‌ డివిజన్‌లోని ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ కాలనీలో నూతన ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల తెలిపారు. శనివారం ఆయన డివిజన్‌ కార్పొరేటర్‌ తీగల సునరితారెడ్డి, జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 ఈఈ రాధిక, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్‌, జలమండలి మలక్‌పేట డీజీఎం శీలారాణి, మేనేజర్‌ చంద్రునాయక్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ మోదిన్‌షా, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌, కార్యదర్శి రాజేశ్‌చతుర్వేది, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సంతోష్‌ జైస్వాల్‌తో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నూతన ఫుట్‌పాత్‌నిర్మాణానికి ఎమ్మెల్యే బడ్జెట్‌ నుంచి రూ.36లక్షలు మంజూరు చేయించినట్లు బలాల తెలిపారు.

కాలనీకి ఆనుకుని ఉన్న దాదాపు 56 ఇళ్లకు తాగునీటి కనెక్షన్‌ లేదని విన్నవించగానే వెంటనే నూతన పైప్‌లైన్‌ వేయించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జలమండలి మలక్‌పేట డీజీఎం శీలారాణికి సూచించారు. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో కొంతమంది చెత్త పారేసి డంపర్‌గా మార్చడంతో దుర్వాసనతోపాటు దోమలు వృద్ధ్ది చెందుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఖాళీ ప్లాట్లలోని చెత్త తొలగింపునకు చర్యలు చేపట్టాలని శానిటేషన్‌ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే ఖాళీ ప్లాట్లను వాహనాల పార్కింగ్‌ కోసం ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. 


Updated Date - 2020-09-13T14:31:52+05:30 IST