‘భగీరథ’ను అనుసరించండి

ABN , First Publish Date - 2020-07-18T08:11:19+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తాగునీరందించే మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం మరోసారి ప్రశంసించింది. మిషన్‌ భగీరథలో తెలంగాణ ప్రభుత్వం పాటించిన విధానాలను అనుసరించాలని అన్ని

‘భగీరథ’ను అనుసరించండి

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తాగునీరందించే మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం మరోసారి ప్రశంసించింది. మిషన్‌ భగీరథలో తెలంగాణ ప్రభుత్వం పాటించిన విధానాలను అనుసరించాలని అన్ని రాష్ర్టాలకు సూచించింది. భగీరథ పథకం అన్ని రాష్ర్టాలకు మార్గదర్శనం అని కేంద్ర జల్‌ జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ సాహూ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు ఈ సందేశాన్ని పంపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా మంచినీటి వృధాను అరికట్టి, అవసరమైన మేరకు సరఫరా చేయవచ్చన్నారు. ఆయా రాష్ర్టాలు అధ్యయనానికి తమ సాంకేతిక బృందాలను తెలంగాణ రాష్ర్టానికి పంపి, మంచినీటి సరఫరాలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని రాష్ర్టాలకు ఆయన సూచించారు.  ‘భగీరథ’పై అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని కేంద్ర జల్‌ మిషన్‌ అన్ని రాష్ట్రాలకు లేఖ రాయడంపై మాజీ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఆ లేఖను శుక్రవారం ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-07-18T08:11:19+05:30 IST