సీఎం కేసీఆర్ ఆదేశాలను గౌవించండి- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-03-25T20:53:28+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కకూ తమ ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఉగాదిని జరుపుకోవాలని కోరారు. పండగ పేరుతో ఎవరూ బయటకు వెళ్ల వద్దన్నారు. స్వీయ నియంత్రణన సామాజిక బాధ్యతతగా భావించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా నడుచుకోవాలని సూచించారు. ఇది మనందరికీ పరీక్షా సమయమని అంటూ ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటిస్తూ సహనంతో వ్యవహరించాలన్నారు. ఇంట్లోనే ఉంటూ రాష్ర్టానికీ దేశానికి అండగా, ఐక్యంగా నిలబడాల్సిన సమయమని మంత్రి పేర్కొన్నారు. రూమర్లను పట్టించుకోకుండా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఎగాది అంటే శుభారంభమని ఈ ఉగాదిని కరోనా మహమ్మారిపై విజయం సాధించే శుభారంభంగా మార్చుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.