ఫ్లయింగ్ స్క్వాడ్స్.. స్టాటిక్ సర్వ్‌లెన్స్‌పై ఈసీ అసంతృప్తి
ABN , First Publish Date - 2020-12-01T08:23:03+05:30 IST
ఎన్నికల కోసం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వ్‌లెన్స్ బృందాల పని తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది

హైదరాబాద్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోసం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వ్‌లెన్స్ బృందాల పని తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. 60 ఫ్లయింగ్ స్క్వాడ్, 30 స్టాటిక్ సర్వ్‌లెన్స్ బృందాలు ఉన్నా.. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం వంటి పలు సంఘటనలు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి. దీంతో నియమావళి ఉల్లంఘనలపై దృష్టి సారించాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ బృందాలను ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశించారు.