యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన

ABN , First Publish Date - 2020-04-05T07:57:35+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను అలంకరించి...

యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను  అలంకరించి సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు.  వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఉపాలయంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు జరిగాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాదాద్రీశుడికి ఆస్థానపరంగా ఆర్జితసేవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పూజలు పరిమిత సంఖ్యలో అర్చక, అధికార బృందం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

Updated Date - 2020-04-05T07:57:35+05:30 IST