భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద కష్టాలు
ABN , First Publish Date - 2020-09-16T18:55:32+05:30 IST
వానలు వస్తే చాలు.. వారంతా బతుకు పోరాటం చేయాల్సిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వానలు వస్తే చాలు.. వారంతా బతుకు పోరాటం చేయాల్సిందే. దశాబ్దాలు గడుస్తున్నా.. ఏజెన్సీ వాసుల కష్టాలు మాత్రం తీరడంలేదు. వాగులు, వంకలతో పోరాటం చేయకతప్పడంలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ వాసులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
భారీ వర్షాలకు గుండాల మండలంలోని మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగగూడెం, ఎదరరేవు వద్ద మల్లన్నవాగుకు ప్రవాహం పెరిగింది. ఓ మహిళను వాగు దాటించేందుకు స్థానికులు తీవ్రంగా కష్టపడ్డారు. కడాయిలో కూర్చొబెట్టి ఆమెను ఒడ్డుకు చేర్చారు. ఏజెన్సీ గ్రామాలైన లింగగూడెం, రోళ్లగడ్డసహా పలు గ్రామస్తులకు వరద కష్టాలు తప్పడంలేదు. వాగుపై వంతెన నిర్మిస్తే కష్టాలు తీరుతాయని స్థానికులు అంటున్నారు. అయినా ఎవరూ తమ బాధతను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.