బీజేపీలోకి వరదలా చేరికలు

ABN , First Publish Date - 2020-12-19T08:08:56+05:30 IST

ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు వరదలా సాగుతున్నాయని బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు.

బీజేపీలోకి వరదలా చేరికలు

 కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మ్యూజియం వైపు : మురళీధర్‌రావు 

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు వరదలా సాగుతున్నాయని బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు సాలార్‌జంగ్‌ మ్యూజియం వైపు పరుగెడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

కంటోన్మెంట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జంపన ప్రతాప్‌, మలక్‌పేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సతీష్‌, పలువురు స్థానిక నాయకులు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వారికి కండువా వేసి ఆహ్వానించారు.


Read more