వరద బాధితుల కోసం 25 వేల కోట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-12-10T10:14:09+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారంఅందిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి

వరద బాధితుల కోసం 25 వేల కోట్లు ఇవ్వండి

మోదీకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ 


హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారంఅందిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 48 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించిన వారందరూ వరదబాఽధిత ప్రాంతాలకు చెందిన ఓటర్లేనని చెప్పారు. నగరంలో ఇంకా 10 లక్షల మందికి వరదసాయం అందాల్సి ఉందని తెలిపారు. వారందరికీ రూ.25 వేల చొప్పున రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ ప్రధానిని కోరారు. మేయరు పదవి దక్కితేనే వరదసాయం చేస్తామని బీజేపీ నేతలు మాటమారుస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. 

Read more