వరదసాయం పంపిణీలో అక్రమాలపై గవర్నర్‌కు ఉత్తమ్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-11-06T23:14:09+05:30 IST

నగర కాంగ్రెస్‌ నేతలతో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. వరదసాయం పంపిణీలో అక్రమాలపై గవర్నర్‌ తమిళసైకి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు

వరదసాయం పంపిణీలో అక్రమాలపై గవర్నర్‌కు ఉత్తమ్ ఫిర్యాదు

హైదరాబాద్‌: నగర కాంగ్రెస్‌ నేతలతో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. వరదసాయం పంపిణీలో అక్రమాలపై గవర్నర్‌ తమిళసైకి  ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. న్యాయవిచారణ జరపాలని గవర్నర్‌ను ఆయన కోరారు. వరదసాయం పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అసలైన వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందలేదని ఆరోపించారు. వరద సాయం డబ్బులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దోచుకున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.


మరోవైపు వరద సాయం పంపిణీలో అవకతవకలపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు, బాధితులు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను కొన్ని రోజులు నిలిపివేసింది. గురువారం నుంచి మళ్లీ ప్రారంభించింది. అయితే, కొన్ని చోట్ల మాత్రమే పంపిణీ జరగగా, చాలా చోట్ల దాని గురించి ప్రస్తావన లేదు.

Updated Date - 2020-11-06T23:14:09+05:30 IST