వరద నష్టపరిహారం రేపటి నుంచి పంపిణీ చేస్తాం: తలసాని

ABN , First Publish Date - 2020-10-20T01:11:29+05:30 IST

నాలాలు, చెరువులపై కట్టడాలు తమ ప్రభుత్వంలో కట్టినవి కాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని

వరద నష్టపరిహారం రేపటి నుంచి పంపిణీ చేస్తాం: తలసాని

హైదరాబాద్: నాలాలు, చెరువులపై కట్టడాలు తమ ప్రభుత్వంలో కట్టినవి కాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి..ఇప్పుడా పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైదరాబాద్ అంతా తిరిగి ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, నీతిఅయోగ్ నిర్ణయంలో తెలంగాణ నష్టం కలిగినా బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నామని తెలిపారు. ప్రధాని హైదరాబాద్ వరదల కోసం తక్షణ సహాయం కింద నిధులు విడుదల చేయాలని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. ఇప్పుడు వరదల వల్ల తెలంగాణ ఇబ్బందులు పడితే స్పందన లేదన్నారు. నష్టపరిహారం సోమవారం నుంచి పంపిణీ చేస్తామని, ప్రజలందరూ సహకరించాలని శ్రీనివాస్‌యాదవ్ కోరారు.

Updated Date - 2020-10-20T01:11:29+05:30 IST