రాం నగర్ మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీసిన వరద బాధితులు
ABN , First Publish Date - 2020-12-07T16:13:12+05:30 IST
హైదరాబాద్: రాం నగర్ మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు బారులు తీరారు.

హైదరాబాద్: రాం నగర్ మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు బారులు తీరారు. ముఖ్యమంత్రి ఈ నెల 7 నుంచి మీ సేవ కేంద్రాల వద్ద అప్లికేషన్ చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో వరద బాధితులు పెద్ద మొత్తంలో మీ సేవా కేంద్రాలకు తరలి వచ్చారు. కాగా.. మీ సేవా కేంద్రాల వద్దకు వస్తున్న వారిని పోలీసులు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ వినకుండా మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారు. వరద సాయం అప్లికేషన్ విషయమై ఎలాంటి ఆదేశాలు రాలేదని మీ సేవాకేంద్రాలు చెబుతున్నాయి.