శంషాబాద్ నుంచి షికాగోకు విమాన సేవలు
ABN , First Publish Date - 2020-12-10T07:29:30+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని షికాగోకు వచ్చే నెల 15 నుంచి ఎయిర్ ఇండియా విమాన సేవల్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు బుధవారం ప్రకటించారు. బోయింగ్ 777-2000 విమానాలతో నడిచే ఈ సర్వీసుల్లో 238 సీట్ల సామర్ధ్యం(8 ఫస్ట్ క్లాస్+35 బిజినెస్ క్లాస్+195 ఎకానమీ క్లాస్) ఉంటుందని..

8 జనవరి 15 నుంచి ప్రారంభం: జీఎంఆర్
శంషాబాద్ రూరల్, డిసెంబరు 9: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని షికాగోకు వచ్చే నెల 15 నుంచి ఎయిర్ ఇండియా విమాన సేవల్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు బుధవారం ప్రకటించారు. బోయింగ్ 777-2000 విమానాలతో నడిచే ఈ సర్వీసుల్లో 238 సీట్ల సామర్ధ్యం(8 ఫస్ట్ క్లాస్+35 బిజినెస్ క్లాస్+195 ఎకానమీ క్లాస్) ఉంటుందని.. దాదాపు 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, తిరుపతి, భవనేశ్వర్, రాజమండ్రి, భోపాల్ వంటి నగరాల నుంచి అమెరికాకు ఏటా 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.