మళ్లీ విమానాలు రయ్‌.. రయ్‌

ABN , First Publish Date - 2020-12-01T08:40:31+05:30 IST

విమానయానం క్రమేపీ పుంజుకుంటోంది. కొవిడ్‌ అన్‌లాక్‌ తర్వాత హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు పెరగడంతో అదే స్థాయిలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు పునరుద్ధరించిన నాటి నుంచి నవంబరు 23వ తేదీ వరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 35వేలకు పైగా

మళ్లీ విమానాలు రయ్‌.. రయ్‌

శంషాబాద్‌ నుంచి పెరిగిన రాకపోకలు(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) :

విమానయానం క్రమేపీ పుంజుకుంటోంది. కొవిడ్‌ అన్‌లాక్‌ తర్వాత హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు పెరగడంతో అదే స్థాయిలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు పునరుద్ధరించిన నాటి నుంచి నవంబరు 23వ తేదీ వరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 35వేలకు పైగా దేశీయ విమానాలు రాకపోకలు సాగించగా.. వీటిలో 30లక్షల మంది ప్రయాణించారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్నాళ్లు పాటు విమానాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సడలింపుల్లో భాగంగా మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దశల వారీగా దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరించారు. కొవిడ్‌కు ముందు హైదరాబాద్‌ నుంచి 55 గమ్యస్థానాలకు రాకపోకలు సాగగా.. ఆంక్షల ఎత్తివేత తర్వాత ఇప్పుడు మళ్లీ 54 గమ్యస్థానాలకు సర్వీసులు నడుస్తున్నాయి.

Updated Date - 2020-12-01T08:40:31+05:30 IST