పెళ్లిలో ఫ్లెక్సీ గొడవ

ABN , First Publish Date - 2020-12-14T03:00:40+05:30 IST

ళ్లిలో ఫ్లెక్సీ గొడవ ఇరువర్గాల మధ్య చిచ్చురేపింది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి..

పెళ్లిలో ఫ్లెక్సీ గొడవ

మహబూబ్‌నగర్ రూరల్:  పెళ్లిలో ఫ్లెక్సీ గొడవ ఇరువర్గాల మధ్య చిచ్చురేపింది.  మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి తండాలో పెళ్లి ఫ్లెక్సీ చించారంటూ బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పదిమందికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించారు. పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-14T03:00:40+05:30 IST