బ్రేకింగ్ : తొలిసారి తెలంగాణ వ్యక్తికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-03-22T00:02:07+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకూ పాకింది...

బ్రేకింగ్ : తొలిసారి తెలంగాణ వ్యక్తికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకూ పాకింది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వారికి మాత్రమే కరోనా సోకింది. అయితే తొలిసారి తెలంగాణ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా మరొకరికి ఈ వైరస్‌ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. శనివారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


ఎలా వచ్చింది!?

పూర్తి వివరాల్లోకెళితే.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు ఈ నెల 14న వైద్యులు గుర్తించారు. అయితే అతడితో సన్నిహితంగా మెలిగిన 35 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాగా.. తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అతడికి ప్రత్యేక విభాగంలో  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ కేసు నమోదవ్వడం.. మరోవైపు అనుమానితుల సంఖ్య పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-03-22T00:02:07+05:30 IST