బాసర ట్రీపుల్ ఐటీలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-06-01T08:53:19+05:30 IST
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించింది.
- రూ.20 లక్షల ఫర్నీచర్ దగ్ధం.. 20 రోజుల్లో మూడోసారి
బాసర, మే 31: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మొదటి అకాడమిక్ బ్లాక్‌లో షార్ట్ సర్య్కూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. తరగతి గదిలో ఫర్నీచర్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్‌ను పిలిపించడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కుర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. గత 20 రోజుల్లో ఇలా అగ్ని ప్రమాదం జరగడం ఇది మూడోసారి.