ధర్మపురిలో పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-09-29T17:30:06+05:30 IST

ధర్మపురిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

ధర్మపురిలో పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం

జగిత్యాల జిల్లా: ధర్మపురిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగాయి. క్యాన్‌లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. తుంబనాలకు చెందిన ఓ వ్యక్తి వెంట తెచ్చుకున్న క్యాన్‌లో బైక్‌పై కూర్చొని పెట్రోల్ పోయించాడు. అయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బైక్‌పై కూర్చున్న వ్యక్తి క్యాన్ అక్కడే పడేసి పరుగులు తీశాడు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో ఈ ప్రమాదం తప్పింది.

Updated Date - 2020-09-29T17:30:06+05:30 IST