పేద న్యాయవాదులకు ఆర్థిక సహాయం
ABN , First Publish Date - 2020-04-05T07:25:16+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న న్యాయవాదులు...

హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న న్యాయవాదులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు పూర్తి చేసి tsbccovid19@gmail.com కు ఏప్రిల్ 5 నుంచి 7 మధ్య పంపాలని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ. నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అనర్హులు దరఖాస్తు చేస్తే వారిపై బార్ కౌన్సిల్ యాక్టు 1961లోని సెక్షన్ 35 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తులను www.telanganabarcouncil.org నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 2015 జనవరి 1 నుంచి నమోదయిన న్యాయవాదులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.