చివరి చూపునకు ‘ఆ నలుగురు’ వెనకడుగు..

ABN , First Publish Date - 2020-03-28T12:32:48+05:30 IST

కరోనా భయంతో తమ వారికి తుది వీడ్కోలు పలికేందుకు ఆ నలుగురు కరువవుతున్నారు.

చివరి చూపునకు ‘ఆ నలుగురు’ వెనకడుగు..

హైదరాబాద్/సైదాబాద్‌ : కరోనా భయంతో తమ వారికి తుది వీడ్కోలు పలికేందుకు ఆ నలుగురు కరువవుతున్నారు. తమ వాళ్లు చనిపోయినా చివరి చూపు చూసేందుకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో ఎవరైనా చనిపోతే బంధుమిత్రులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొనేవారు. ప్రస్తుతం సీన్‌ మారిపోయింది. సైదాబాద్‌ దోభీఘాట్‌ హిందూ శ్మశానవాటికలో రోజుకు 5 నుంచి 10 వరకు అంత్యక్రియలు జరుగుతుంటాయి. అయితే, గతంలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యేవారు. కొన్ని రోజులుగా ఇక్కడ జరిగే అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులు కొందరు మాత్రమే ఉంటున్నారు. అలా హాజరయ్యే వారి సంఖ్య పదులలోపే ఉండడం గమనార్హం.  

Updated Date - 2020-03-28T12:32:48+05:30 IST