ఆందోల్‌-జోగిపేటకు తుది నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-07-14T08:34:07+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం

ఆందోల్‌-జోగిపేటకు తుది నోటిఫికేషన్‌

  • రాష్ట్రంలో 73కి చేరిన ‘రెవెన్యూ డివిజన్లు’

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో రెవెన్యూ డివిజన్‌ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. సోమవారం తుది నోటి ఫికేషన్‌ ఇచ్చారు. దాంతో పాటు ఇదే డివిజన్‌లో కొత్తగా చౌటాకూర్‌ అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌ పరిధిలో ఆందోల్‌, పుల్కల్‌, వట్‌పల్లి, చౌటకూర్‌ మండలాలను చేర్చారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమవారం జీవో నం.79ను జారీ చేశారు. కొత్త డివిజన్‌కు హెడ్‌క్వార్టర్‌గా జోగిపేట ఉండనుంది. తాజా ఉత్తర్వులతో డివిజన్‌ ఏర్పాటు సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. దాంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కి చేరింది. ఇక మండలాల సంఖ్య 590కి చేరినట్లయింది. 

Updated Date - 2020-07-14T08:34:07+05:30 IST