ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-04-05T11:30:01+05:30 IST

ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ సమ్మెను బేషరతుగా విరమించేందుకు సుముఖంగా ఉన్నారని, వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు...

ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఏపిల్ర్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ సమ్మెను బేషరతుగా విరమించేందుకు సుముఖంగా ఉన్నారని, వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నిర్దేశించిన లక్ష్యాలను కాంట్రాక్టు రెన్యువల్‌తో ముడి పెడుతూ ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాన్నే నమ్ముకుని పనిచేస్తున్న కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ ఉద్యోగం పోతుందేమోనని సమ్మెకు పోయారని తెలిపారు. 

Updated Date - 2020-04-05T11:30:01+05:30 IST