బారెగూడలో 30 మందికి జ్వరాలు

ABN , First Publish Date - 2020-04-01T08:21:17+05:30 IST

బారెగూడలో 30 మందికి జ్వరాలు

బారెగూడలో 30 మందికి జ్వరాలు

కరోనా నేపథ్యంలో ఆందోళన

బెజ్జూరు, మార్చి 31: ఒకవైపు కరోనా ముప్పును ఎదుర్కొంటున్న తరుణంలో కుమరం భీం జిల్లా బెజ్జూరు మండలంలో జ్వరాలు ప్రబలడం ఆందోళన కలిగిస్తోంది. బారెగూడ పంచాయతీ పరిధిలోని కోయగూడలో ప్రజలు మూడు రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 30 మంది జ్వర పీడితులున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడుతున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-04-01T08:21:17+05:30 IST