ఈ-పాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయించాలి
ABN , First Publish Date - 2020-08-22T10:17:25+05:30 IST
ప్రస్తుత వానాకాల సీజన్‌లో ఈ-పాస్ ద్వారానే ఎరువులు విక్రయించి అమ్మకాల్లో స్టాకు నిల్వలో డీలర్లు పారదర్శకత పాటించాలని జనగామ కలెక్టర్ కె.నిఖిల ఆదేశించారు
కలెక్టర్ కె.నిఖిల
జనగామ టౌన్, ఆగస్టు 21 :
ప్రస్తుత వానాకాల సీజన్‌లో ఈ-పాస్ ద్వారానే ఎరువులు విక్రయించి అమ్మకాల్లో స్టాకు నిల్వలో డీలర్లు పారదర్శకత పాటించాలని జనగామ కలెక్టర్ కె.నిఖిల ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలో ఎరువుల పంపిణీ నిల్వలపై వ్యవసాయ అధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వానాకాలం పంటలకు 38.727 మెట్రిక్ టన్నుల యూరియా, 16,982 మెట్రిక్ ట్నుల కాంప్లెక్స్ ఎరువులు, 19,954 మెట్రిక్ టన్నుల యంఓపీ ఎరువుల అవసరం గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రైతులకు సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు డీలర్లు, పీఏసీఎ్‌సలలో ఈ-పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు అమ్మాలన్నారు. సమీక్షలో డీఏవో జి.నర్సింగం పాల్గొన్నారు.