కేశవరావు, సురేష్‌రెడ్డిని సన్మానించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-03-19T01:14:35+05:30 IST

రాజ్యసభ సభ్యులుగా ఏక గ్రీవంగా ఎన్నికైన కె.కేశవరావు, కెఆర్‌ సురేష్‌రెడ్డిని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సన్మానించారు

కేశవరావు, సురేష్‌రెడ్డిని సన్మానించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యులుగా ఏక గ్రీవంగా ఎన్నికైన కె.కేశవరావు, కెఆర్‌ సురేష్‌రెడ్డిని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సన్మానించారు. వారి ఎన్నికను ప్రకటించగానే మంత్రి తలసాని అసెంబ్లీ ప్రాంగణంలోనే వారిని సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఇద్దరు నేతలూ తిరిగి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం అభినందించ దగ్గ విషయమని అన్నారు. వారి రాజకీయ అనుభవం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌పార్టీకి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలు గర్వపడేలా , టీఆర్‌ఎస్‌పార్టీ పేరు నిలబెట్టేలా తాము పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, సురేష్‌రెడ్డి అన్నారు.  తిరిగి మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎనుకున్నందుకు కేశవరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. అలాగే తనను రాజ్యసభకు ఏక గ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు సురేష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గర్వపడేలా పని చేస్తానని అన్నారు. 

Updated Date - 2020-03-19T01:14:35+05:30 IST