త్వరలో మార్కెట్లోకి ఫావిపిరవిర్‌ ఇంజక్షన్‌?

ABN , First Publish Date - 2020-09-05T09:40:27+05:30 IST

త్వరలో మార్కెట్లోకి ఫావిపిరవిర్‌ ఇంజక్షన్‌?

త్వరలో మార్కెట్లోకి ఫావిపిరవిర్‌ ఇంజక్షన్‌?

హైదరాబాద్‌, సెప్టెంబరు 4: కొవిడ్‌ చికిత్సలో ఫావిపిరవిర్‌ సమర్థవంతంగా పనిచేస్తోందన్న నివేదికల నేపథ్యంలో.. ఈ ఔషధానికి డిమాండ్‌ భారీగా పెరిగింది. అయితే, కోర్సులో భాగంగా 100ఫావిపిరవిర్‌ (200 ఎంజీ) ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తోంది. అదీ 10 రోజుల్లోనే. ఇందుకు పరిష్కారంగా ఇంజక్షన్‌ తయారుచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన హైదరాబాద్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలకు వచ్చింది. ఆ దిశగా పరిశోధనలు కూడా చేపట్టాయి. ఓ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇప్పటికే ఇంజక్షన్‌ తయారీ పనులు కూడా మొదలుపెట్టినట్లు, త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-09-05T09:40:27+05:30 IST