ఐసీఎస్‌ఐ విధానంలో తండ్రి అయిన కేన్సర్‌ విజేత

ABN , First Publish Date - 2020-09-01T08:39:05+05:30 IST

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 2012లో వివాహమైంది. సరిగ్గా అదే సమయానికి ఛాతీ, ఊపిరిత్తుల మధ్య ప్రాంతంలో

ఐసీఎస్‌ఐ విధానంలో తండ్రి అయిన కేన్సర్‌ విజేత

  • ఏడేళ్ల క్రితమే వీర్యకణాల సేకరణ
  • తాజాగా ఆడబిడ్డను ప్రసవించిన భార్య

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 2012లో వివాహమైంది. సరిగ్గా అదే సమయానికి ఛాతీ, ఊపిరిత్తుల మధ్య ప్రాంతంలో మెడియాస్టినల్‌ ట్యూమర్‌ అనే ప్రాణాంతక కేన్సర్‌ సోకింది. ఇటీవలే కేన్సర్‌ను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అయితే.. కీమోథెరపీ, రేడియో థెరపీ తీవ్రత కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయారు. ముందుచూపుతో వైద్యులు ఇచ్చిన సలహా మేరకు.. చికిత్సకు ముందే ఆ ఇంజనీర్‌ తన వీర్యకణాలను ఒయాసిస్‌ ఫెర్టిలిటి బ్యాంకులో భద్రపరిచారు. ఇటీవల కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన, భద్రపరిచిన వీర్యకణాల ద్వారా తండ్రి కావాలనుకున్నారు. ఆ జంట కోరిక మేరకు.. ఒయాసిస్‌ ఫెర్టిలిటి వైద్యులు ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌(ఐసీఎ్‌సఐ) విధానం ద్వారా అతడి భార్య గర్బం దాల్చేలా గత డిసెంబర్‌లో వైద్యం అందించారు. ఆ ప్రయత్నం సఫలీకృతమై గర్భం దాల్చిన ఆమె, వారం క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చారు.  

Updated Date - 2020-09-01T08:39:05+05:30 IST