కాల్పుల కేసులో ఫారుఖ్ అహ్మద్‌కు రిమాండ్
ABN , First Publish Date - 2020-12-20T07:38:06+05:30 IST
ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పులకు పాల్పడిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
ఆదిలాబాద్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పులకు పాల్పడిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేజిస్ర్టేట్ ముందు హాజరుపర్చగా డిసెంబరు 31 వరకు రిమాండ్ విధించారు. తిరిగి 31న కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించారు.
కాగా, కాల్పుల ఘటనను సీరియ్‌సగా తీసుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఫారుఖ్ అహ్మద్‌ను తొలగిస్తూ, జిల్లా కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.