రైతులు అధైర్యపడోద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది..

ABN , First Publish Date - 2020-04-14T11:00:02+05:30 IST

వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని..నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ

రైతులు అధైర్యపడోద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది..

ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌ కుసుమ జగదీష్‌      


కొత్తగూడ, ఏప్రిల్‌ 13 : వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని..నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ హామీ ఇచ్చారు. కొత్తగూడ మండలంలో రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానతో పొగుళ్లపల్లి, కోనాపురం గ్రామాలలో వరిపంట నేలవాలి, ధాన్యం రాలిపోయ్యాయి. ఈ పంటలను కుసుమ జగదీష్‌, ఓడీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ దేశిడి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో ఉదయ్‌ పరిశీలించారు. రైతులను పరామర్శించారు. నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్ట పరిహారం సకాలంలో అందజేయాలని వ్యవసాయ అధికారులకు జగదీష్‌ చేతులెత్తి వేడుకున్నారు.


అనంతరం సాధిరెడ్డిపల్లిలోని గండిచెరువును జగదీష్‌ పరిశీలించారు. పాఖాల చెరువు నుంచి లిఫ్ట్‌ ద్వారా నీటితో గండి చెరువును నింపితే మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలోని గ్రామాలకు సాగునీరు అందించవచ్చని ఓడీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి జడ్పీ చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. సాధిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త వట్టం పాపయ్యను జగదీష్‌ పరామర్శింశారు.


కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు, ఎంపీటీసీలు ననుబోతులు స్వప్న లింగన్న, మోకాళ్ల సంతోషరాణి వెంకటేష్‌, సర్పంచ్‌లు అజ్మీరా మంగమ్మ, కొట్టెం సావిత్రి, నారాయణ, రమేష్‌, సొసైటీ డైరెక్టర్లు గజ్జి కొమురెళ్లి, లక్ష్మయ్య, నాయకులు కొలిపాక సదానందం, సంపత్‌రావు, లెక్కాల భాస్కర్‌రెడ్డి, కొనకటి ప్రశాంత్‌, సంతోష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-14T11:00:02+05:30 IST