మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2020-10-31T15:58:54+05:30 IST
నల్గొండ: మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

నల్గొండ: మిర్యాలగూడలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతులు నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ రోజు క్రాప్ కటింగ్ హాలీడేగా అధికారులు ప్రకటించారు. అయితే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లే ధాన్యానికి మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ క్రమంలోనే మిల్లుల వద్ద వందలాది ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి.