తీవ్ర దుర్భర పరిస్థితిలో రైతాంగం

ABN , First Publish Date - 2020-04-07T20:35:03+05:30 IST

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న..

తీవ్ర దుర్భర పరిస్థితిలో రైతాంగం

వరంగల్: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర దుర్భర పరిస్థితిలో ఉన్నారు. శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా వరి, మిర్చి, కూరగాయలు, పూలు, పసుపు పంటలు సాగు చేసే రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కూలీలు దొరక్కా రైతులు ఇబ్బందులు  పడుతున్నారు. దీంతో పంటలను పొలాల్లోనే వదిలేసే పరిస్థితి నెలకొంది. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా కూలీలు దొరకడంలేదు.

Read more