ప్రగతి భవన్ ముట్టడికి రైతుల యత్నం
ABN , First Publish Date - 2020-11-13T09:32:00+05:30 IST
సీఎం కేసీఆర్ చెబితేనే సన్నాలు వేశామని, పంట చేతికి వచ్చాక మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతు ఐక్య
సీఎం కేసీఆర్ చెబితేనే సన్నాలు వేశామని, పంట చేతికి వచ్చాక మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్నదాతలు గురువారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరు జిల్లాలకు చెందిన రైతులు దశల వారీగా ప్రగతి భవన్ వద్దకు వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ సన్నరకం వడ్లకు రూ.2,500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో భూపాలపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐఎ్‌ఫబీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.