పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-18T10:06:53+05:30 IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల అంతయ్య (50)కు ఉన్న మూడెకరాల భూమికి

పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి రైతు ఆత్మహత్య

చేవెళ్ల, జూన్‌ 17 :  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల అంతయ్య (50)కు ఉన్న మూడెకరాల భూమికి సంబంధించిన కొత్త పాస్‌బుక్‌లు రాలేదు. రెవెన్యూ రికార్డుల్లో సైతం ఆ వివరాలు నమోదు చేయలేదు.  భూ రికార్డులో పేరు నమోదు చేసి కొత్తపాస్‌ పుస్తకం ఇప్పించాలని పలు మార్లు అధికారుల చుట్టూ తిరిగాడు.  ఫలితం లేదు.  దాంతో మనస్థాపం చెందిన అంతయ్య బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

Updated Date - 2020-06-18T10:06:53+05:30 IST