జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సులు
ABN , First Publish Date - 2020-05-29T11:15:03+05:30 IST
జిల్లా వ్యాప్తంగా గురువారం నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు

కురవిలో మంత్రి సత్యవతి, ధన్నసరిలో కలెక్టర్
మహబూబాబాద్ రూరల్/కురవి/నెల్లికుదురు/కేసముద్రం, మే 28 : జిల్లా వ్యాప్తంగా గురువారం నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లాలోని కురవి మం డలం గుండ్రాతిమడుగులో మంత్రి సత్యవతి రాథోడ్, కేసముద్రం మండలం ధన్ససరిలో కలెక్టర్ వీపీ.గౌతమ్, నెల్లికుదురు మండలం జామతండాలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, బయ్యారం మండలం కంబాలపల్లి, ఇర్సులాపురం తదితర గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ ఆం గోతు బిందు ముఖ్యఅతిథులుగా హాజరై నియంత్రిత సాగు విధానంపై ప్రసంగించారు. కురవి మండలం గుండ్రాతిమడుగులో నిర్వహించిన రైతు సదస్సులో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కేసముద్రం మండలం ధనసరి గ్రామంలో జరిగిన రైతు సదస్సులో కలెక్టర్ వీపీ.గౌతమ్ పాల్గొని ప్రసంగించారు.
నియంత్రిత సాగు విధానంపై అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, జడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీపీ చంద్రమోహన్ పాల్గొన్నారు. నెల్లికుదురు మండలంలోని జామతండాలో జరిగిన రైతు సదస్సులో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని ప్రసంగించారు. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రైతుబందు సమితి జిల్లా కోఆర్డినేటర్ బానోత్ బాలాజీనాయక్, వైస్ ఎంపీపీ వెంకటేష్ పాల్గొన్నారు. బయ్యారం మండలం కంబాలపల్లి, ఇర్సులాపురం, కొత్తపేట గ్రామా ల్లో జరిగిన సదస్సులో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, ఏవో రాంజీనాయక్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
మహబూబాబాద్ మండలం అమనగల్‌లో జరిగిన రైతు సదస్సులో మండల రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తేళ్ల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఎల్ధి మల్లయ్య, లూనావత్ అశోక్‌నాయక్, ఏవో తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. పెద్దవంగర మండల కేంద్రంతో పాటు పోచంపల్లి గ్రామంలో జరిగిన రైతు సదస్సులో జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐల య్య పాల్గొన్నారు. డోర్నకల్ మండలం మన్నెగూడెం, చిల్కోడు, గొల్లచర్లలో జరిగిన రైతు సదస్సులో ఎంపీపీ బాలునాయక్, జడ్పీటీసీ కమల, ఏవో పద్మజ, తొర్రూరు మండలం ఫత్తేపురం, నాంచారిమడూర్, అమర్సింగ్తండాలో జరిగిన రైతు సదస్సులో ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, ఏవో కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. గార్లలో జరిగిన కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు బానోత్ హరిసింగ్ నాయక్, పీఏసీఎస్ అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్ సర్పంచ్ బన్సీలాల్, జడ్పీటీసీ ఝాన్సీలక్ష్మీ, ఎంపీటీసీలు రమేష్, సుజాత, తహసీల్దార్ పుల్లారావు పాల్గొన్నారు.