రైతుకు ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-04-22T01:02:34+05:30 IST

అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు. వర్షం వల్ల నష్టపోయిన మామిడి కౌలు రైతుకు జగ్గారెడ్డి రూ.50వేలు

రైతుకు ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి: అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు. వర్షం వల్ల నష్టపోయిన మామిడి కౌలు రైతుకు జగ్గారెడ్డి రూ.50వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అకాల వర్షం కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా కౌలు రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

Updated Date - 2020-04-22T01:02:34+05:30 IST