వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

ABN , First Publish Date - 2020-02-08T11:16:50+05:30 IST

మండలంలోని రాంచంద్రాపురం గ్రామానికి చెందిన వేల్పుల రమేశ్‌ (42) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి

వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

సంగెం, ఫిబ్రవరి7: మండలంలోని రాంచంద్రాపురం గ్రామానికి చెందిన వేల్పుల రమేశ్‌ (42) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. ఈ విషయమై మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు చేసిందన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల 6న తాను రమేశ్‌తో కలసి మొక్కజొన్న చేనుకు నీరు పెట్టేందుకు వెల్లింది. తాను చేను వద్ద ఉండగా రమేశ్‌ విద్యుత్‌ మోటర్‌ ఆన్‌చేయడానికి కొద్ది దూరంలోనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కానీ, భర్త ఎంతసేపైనా రాకపోవడంతో బావి వద్దకు వెళ్లడంతో రమేష్‌ కనిపించలేదు. దీంతో భర్త ఆచూకి కోసం ఇంటికి వెళ్లి చూసింది. బందువులను ఆరా తీయడంతో మోటర్‌ పని చేయడం లేదని స్పానర్లు తీసుకు వెళ్లాడన్నారు. వెంటనే బావి వద్దకు వెళ్లి చూడగా మోటర్‌ పైపులు ఊడి పోయి కనిపించాయి. అనుమానంతో బావిలో నీటిని తీసి వెతకడంతో తలకు బలమైన గాయాలు తగిలి బావి అడుగు భాగంలో పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని పంచనామ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-02-08T11:16:50+05:30 IST