రైతు దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-18T09:20:06+05:30 IST

వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఆ పెద్ద కుటుంబానికి సాగు కలిసి రాలేదు... నష్టాలకు తోడు అప్పులు పెరిగాయి.. దీంతో జీవితంపై విరక్తి చెందిన రైతు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా

రైతు దంపతుల ఆత్మహత్య

రఘునాథపాలెం, మే 17 : వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఆ పెద్ద కుటుంబానికి సాగు కలిసి రాలేదు... నష్టాలకు తోడు అప్పులు పెరిగాయి.. దీంతో జీవితంపై విరక్తి చెందిన రైతు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాంతండాకు చెందిన వాంకడోత్‌ హేమ్ల(62), తులసి(58) దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మూడెకరాలు అమ్మి అందరికీ పెళ్లిళ్లు చేశారు. మానసిక వికలాంగుడైన చిన్నకుమారుడిని చూసుకుంటూ మిగిలిన మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు.  కొంత కాలంగా పంటలు పండక అప్పులు పెరిగిపోయాయి. వీటిని తీర్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. చివరకు మనస్పర్థలు పెరిగాయి.  కూతుళ్లకు ఇవ్వాల్సిన కట్నాలు కూడా బాకీ ఉండటం, అప్పులు పెరిగిపోవడంతో హేమ్ల, తులసి ఈనెల 15న పురుగుమందు తాగారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందారు. 

Updated Date - 2020-05-18T09:20:06+05:30 IST