అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-18T09:43:46+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌ గ్రామానికి చెందిన లింగంపెల్లి దేవరావు(48) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందుతాగి

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చందుర్తి, సెప్టెంబరు 17: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌ గ్రామానికి చెందిన లింగంపెల్లి దేవరావు(48) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరావు తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. పంట పండించడం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల్లో అప్పులు చేశాడు. పంట వేసిన ప్రతిసారి దిగుబడి సరిగా రాలేదు. చేసిన అప్పులు రూ.8 లక్షల వరకు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు.  గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. ఙ

Updated Date - 2020-09-18T09:43:46+05:30 IST