పంట నష్టం వచ్చిందని.. రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-05T08:45:54+05:30 IST

పంట నష్టం వచ్చిందని.. రైతు ఆత్మహత్య

పంట నష్టం వచ్చిందని.. రైతు ఆత్మహత్య

డోర్నకల్‌, సెప్టెంబరు 4: అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లిందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబుబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారం గ్రామానికి చెందిన చింతల నాగరాజు(34) తన రెండెకరాల భూమితోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని, పత్తి వేసి మిగతా భూమిలో మిర్చిపంట వేయడానికి నారు పోశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతింది. దీంతో అప్పులపాలు కావలసి వస్తుందని నాగరాజు గురువారం పురుగుమందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2020-09-05T08:45:54+05:30 IST