సౌదీలో యువకుడి మృతితో కన్నీటి సంద్రంలో కుటుంబం

ABN , First Publish Date - 2020-05-09T10:05:01+05:30 IST

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన యువకుడు నితిన్‌ (28) అక్కడ మృతి చెందడంతో అతని స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని మంచిప్పలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నితిన్‌ మరణ వార్త తెలిసి అతని

సౌదీలో యువకుడి మృతితో కన్నీటి సంద్రంలో కుటుంబం

మోపాల్‌, మే 8: బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన యువకుడు నితిన్‌ (28) అక్కడ మృతి చెందడంతో అతని స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని మంచిప్పలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నితిన్‌ మరణ వార్త తెలిసి అతని కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన ఆసిడి అశోక్‌ కుమారుడు నితిన్‌ ఆరు నెలల క్రితం సౌదీకి వెళ్లాడు. అతనికి ఏడాదిన్నర కిందటే వివాహం జరిగింది. సౌదీకి వెళ్లిన తర్వాత నితిన్‌ కొన్ని రోజులు పనిచేశాడు. ఇంతలోనే కరోనా ప్రభావంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించడంతో అతడు 15 రోజుల పాటు అన్నం తినకుండా ఉన్నాడు. 3 రోజుల క్రితం చికిత్స పొందుతూ నితిన్‌ మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

Updated Date - 2020-05-09T10:05:01+05:30 IST