క్వారంటైన్‌ భయంతో తప్పుడు వివరాలు

ABN , First Publish Date - 2020-12-30T08:09:23+05:30 IST

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇంకా 156 మంది చిరునామాను వైద్య శాఖ గుర్తించలేకపోయింది. కొందరు క్వారంటైన్‌ భయంతో తప్పుడు సమాచారం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. వీరి విషయంలో

క్వారంటైన్‌ భయంతో తప్పుడు వివరాలు

యూకే రిటర్న్స్‌లో చిరునామా దొరకని 156 మంది


హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇంకా 156 మంది చిరునామాను వైద్య శాఖ గుర్తించలేకపోయింది. కొందరు క్వారంటైన్‌ భయంతో తప్పుడు సమాచారం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. వీరి విషయంలో ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు. కాగా, సీసీఎంబీ చేసిన జన్యు విశ్లేషణలో మంగళవారం వరకు ఇద్దరిలో స్ట్రెయిన్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు వరంగల్‌ వాసి కాగా, రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని రాష్ట్ర వైద్య వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. మరోవైపు సోమవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో మొత్తం 21 పాజిటివ్‌లు నమోదయ్యాయి.  14 మంది గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని, ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.


కొత్త స్ట్రెయిన్‌లో 17 మ్యుటేషన్లు

కరోనా కొత్త స్ట్రెయిన్‌లో 17 మ్యుటేషన్లు గమనించామని.. ఇందులో 8 స్పైక్‌ ప్రొటీన్‌పై ప్రభావం చూపుతాయని సీసీఎంబీ జన్యు విశ్లేషణ బృంద సారథి డాక్టర్‌ దివ్యతేజ సౌపతి తెలిపారు. 

Updated Date - 2020-12-30T08:09:23+05:30 IST